" రామప్ప గుడి వైభవం "
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
〰️〰️〰️〰️〰️〰️〰️〰️
రామప్ప వైభవం మహోన్నతము
శిల్పుల తెలివి వర్ణనాతీతము
గొప్పది కట్టడాల నిర్మాణము
చూడచక్కని తెలుగు సున్నితంబు!
ఇటుకలపై ఆలయ నిర్మాణము
శిల్పకళా నిపుణత అసమానము
కాకతీయ రుద్రయ్య కట్టడము
చూడచక్కని తెలుగు సున్నితంబు!
రామప్ప గుడియే గర్వకారణము
తెలుగువారి ఘన ఆత్మగౌరవము
చూడతరమా చిత్ర నైపుణ్యము
చూడచక్కని తెలుగు సున్నితంబు!
నేత్రానందం చేయు చిత్రాలు
స్తంభాలపైన నాట్య భంగిమలు
చెదరని రాతిరంగు కట్టడాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!
పలుదేశాలు పోటీకి నిలిచెను
రామప్ప కట్టడం గెలుపొందెను
వారసత్వ హోదా సాధించెను
చూడచక్కని తెలుగు సున్నితంబు!
-గద్వాల సోమన్న,
గణితోపాధ్యాయుడు,
ఎమ్మిగనూరు
〰️〰️〰️〰️〰️〰️〰️〰️