సమానత్వమా ఎక్కడ నీ ఉనికి ? (మేము భరత మాతలం భావి భారత శాంతి దూతలం స్త్రీ మూర్తులం) -- దొడ్డపనేని శ్రీ విద్య

సమానత్వమా ఎక్కడ నీ ఉనికి ? (మేము భరత మాతలం భావి భారత శాంతి దూతలం స్త్రీ మూర్తులం) -- దొడ్డపనేని శ్రీ విద్య


సమానత్వమా ఎక్కడ నీ ఉనికి ?

మగవారితో సమాన హక్కులు పొందాము
స్త్రీలను గౌరవించటం లో అసహనం పొందాము
స్త్రీ లేకపోతే జననం లేదు అంటాము
స్త్రీ లేకపోతే సృష్టే లేదు అంటాము
స్త్రీకి స్త్రీ యే శత్రువు అనే నానుడిని పాందాము
శాంతి సహనాలే స్త్రీ రూపాలు అన్నాము
అవే శాపాలై స్త్రీ ని వెంటాడుతున్నాయి
సమానత్వ భావం అనేది మనస్సు లోంచి రావాలి సుమా
పేపర్లోనూ, సభల్లోనూ కలిగే భావనలు కావు
పుత్రుడు, పుత్రిక సమానం అన్నాము
రక్షణలో మాత్రం సహాయం కోసం ఎదురు చూస్తున్నాము
ప్రశ్నించేతత్వాన్ని దిక్కార స్వరం అన్నారు
అంతరాన్ని తగ్గించటానికి సమరాలు చేసాము
ఐక్యరాజ్య సమితి వరకూ నినాదాలు తీర్మానించాము
రాజ్యాధిపతులమై పాలించాము
అత్యాచారాలకు భయపడి రాలి పోయాము
విప్లవాత్మక మార్పులు రావాలని ఒప్పించాము
అసమానతలను అంతం కావాలని విశ్వసించాము
అభ్యుదయ భావాలతో సమాజం లో రాణించాము
కార్యాచరణలో మాత్రం వైఫల్యం పొందాము
అసమానతలు అంటూ చట్టాలు తెచ్చాము
పురోగతిలో మాత్రం ఇంకా కృషి చేస్తున్నాము
సమానత్వం సాధించామా అంటే మాత్రం ఎండమావి గుర్తొస్తోంది
చులకన భావంతో చూసినా సహిస్తాము
అణగదొక్కాలన్న చేతలని భరిస్తాము
ఎందుకంటే మేము భరత మాతలం
భావి భారత శాంతి దూతలం
స్త్రీ మూర్తులం


-- దొడ్డపనేని శ్రీ విద్య,
విజయవాడ.

0/Post a Comment/Comments