తెలుగు బాషా దినోత్సవ శుభాకాంక్షలతో... నా సొగసరి భాష --@ శిష్టు సత్య రాజేష్

తెలుగు బాషా దినోత్సవ శుభాకాంక్షలతో... నా సొగసరి భాష --@ శిష్టు సత్య రాజేష్

 


తెలుగు బాషా దినోత్సవ శుభాకాంక్షలతో 


నా సొగసరి భాష


కమ్మనైనది నా భాష

తియ్యనైనది నా భాష

నిండు పున్నమిలాంటి చల్లనైనది నా భాష

పది మంది మెచ్చుకునే మంచి భాష

అమ్మలాంటి అందమైన మనస్సున్న నా భాష

ప్రపంచ నలుమూలల అభిమానులున్న సొగసరి నా భాష

హిమాలయాలలాంటి చల్లనైనది నా భాష

ఆవుపాలలాంటి స్వచ్చమైనది నా భాష 

పోతన, ఎర్రన, తిక్కన లాంటి దిగ్గజాలు 

అల్లసాని, దూర్జటి, తెనాలి లాంటి అష్టదిగ్గజాలు ఏలిన భాష

శ్రీ శ్రీ రచనలతో ఎరుపెక్కిన నా భాష

వేమన, సుమతీ శతకాలతో మంచిని పెంచిన నా భాష

భాషలెన్ని ఉన్నా, సరిలేదు నా మాత్రుభాషకి 

యాసలెన్ని ఉన్నా, వ్యంగ్యం లేదు నాభాషకి 

ప్రాంతాలు వేరైనా, రాష్ట్రాలు వేరైనా 

అందరినీ ఒకే కుటుంబంలా కలిపే నా భాష

నా, మా, మన తెలుగు భాష, అందరి భాష.

తెలుగు జాతి ఔన్నత్యంను నలుదిశలా వ్యాపించిన నాభాష .....

చేయెత్తి కీర్తించు ......తెలుగు మనుగడకై నడుం బిగించు......


@ శిష్టు  సత్య రాజేష్


0/Post a Comment/Comments