భారతీయులం(అక్షరక్రమకవిత)
---డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి, మేడ్చల్.
స్వాతంత్ర్యం వచ్చిన నుంచి
మనమంతా స్వేచ్ఛా జీవులం.
జనమే బలంగా ఎదిగాం.
వనరులు ఉపయోగించుకొని,
రణములను ఎదుర్కొని,
గతి తప్పని సంస్కరణలతో,
మహనీయుల మార్గదర్శనంతో,
నవోదయాలను ఆహ్వానించాం.
సాహసమైన నిర్ణయాలు గైకొని,
మహాప్రస్థానమే సాగించాం.
జయములెన్నో పొందుతూ,
వర్ణవివక్షకు తావు లేకుండా,
రకరకాలైన సంస్కృతులను,
గణతంత్రపు ఆశయాలను,
మహాత్ముని సిద్ధాంతాలను,
నమ్మి నడుస్తున్న భారతీయులం.