వనకన్య
మధ్యప్రదేశ్ బస్తర్ అడవి గుండా బస్ వెళుతుంది.....చుట్టూరా పెద్ద పెద్ద వృక్షాలు...గుబురు పొదలు..మధ్యలో జడ పాపిడి లా రోడ్.గుహలో నుండి పోతున్నట్లు ఉంది బస్.బస్ నిండుగా జనం...నిద్రావస్థ లో వున్నారు.రాత్రి 10గంటలు కావస్తోంది.....చుట్టూ పర్వత శిఖరాలు....దొంగలకు
స్థావరాలు...అందరూ నిద్ర పోతున్నా ఆర్తి మాత్రం
భయం భయం గా బస్ నుండి బయటకు చూస్తుంది
ఆమె మనసు ఏదో కీడును సంకొచిస్తుంది...ఈ దండకారణ్యం లో చీకట్లో ఏదో తెలియని భయమో,
అనుభవమో జరగబోతున్న ట్లుగా ఆమె సిక్స్ సైన్స్
చెపుతుంది. మై గాడ్ ..ఈ కీకారణ్యంలో ఏదైనా జరిగితే ఎమిటి పరిస్థితి?....,,బస్ లో అందరూ వున్న
లోన్లీ గా ఫీలైంది....చిమ్మ చీకటి చీల్చుకుంటూ ముందుకు పోతుంది బస్.
తనకి మధ్య ప్రదేశ్ ఇండోర్ లో ప్లేస్ మెంట్.... ఇంటర్ వ్యూ కి రమ్మని కాల్.....సడెన్గా అటెండ్ అవా లని....
మంచి జాబ్...ట్రైన్ కి ప్లేన్ కి నో టికెట్స్.... డాడ్ బిజీ
మామ్ మారేజ్ కి వెళ్ళారు.. ..సో సింగిల్ గానే బస్ లో
బయలు దేరింది....అడవిలో చెట్ల మధ్యనుండి అపుడపుడు కనిపిస్తున్న ఆకాశంలో నక్షత్రాలు మిణుకు
మిణుకు మంటూ కనిపిస్తున్నాయి. అవి ఆమె కు భయం లేదంటూ భరోసా ఇస్తున్నట్లు ఫీలైం ది.ఆమె ఆలోచనలతో నిమిత్తం లేనట్లుగా బస్ ముందుకు సాగుతుంది.....ఆలోచనలతో అలసిన ఆర్తికి నెమ్మదిగా నిద్ర పట్టింది......
అడవి మధ్యలో విరిసిన కలువ పూలతో ఉన్న కొలను
"పున్నా గా" నీవు నీ బావను ఇట్టంపడి తే చెర్లో దిగి పులట్టుకురా" పున్నాగ కు దోస్తులు టాస్క్ ఇచ్చారు.
ఓస్ ... ఎట్టెట్టే....కుసంత పని అంటూ....పరికిణీ కచ్చా బోసి వడి వడి గా కొలనులో దిగి పడి నిముషాల్లో
పూలు పీకి తెచ్చింది.
దోస్తులు కళ్ళార్పకుండా చూసారు.
పున్నాగ అందంగా అడవి మల్లిలా పున్నాగ పువులా
స్వ చ్చం గా వుంటుంది.చెంగు చెంగు మంటూ వనకన్య
లా అడివంతా తిరుగుతుంది... ఏ పుట్టలో ఏ పాము
వుందో ఏ గూడు ఏ పక్షిదో అన్ని తెలుసు...ఆమెకు....భయ మన్నదిలేదు ఆమెకు.. పులికి సింహానికి కూడా భయపడకుండా అడవి అంతా
కల తిరుగుతుంది....తనని చూస్తే అడవి పిల్ల వేషం లో ఉన్న మహారాణిలా వుంటుంది.అవలీల గా చెట్టు ఎక్కి పుట్ట తేనె తీసి పల్లె వాళ్ళందరికీ పంచుతుంది.
పల్లె అంతా ఆమెకు బంధువులే... ..వయసు భేదం లేకుండా అందరితో కలివిడిగా వుంటుంది.అత్త కొడుకు భీం తో సమానంగా విలువిద్య లో ప్రవీణురాలు.వనదేవత లా జాతరలో సంద డిచేస్తుంది
బావతో..బావంటే ప్రాణం...బావ కోసం ఏమైనా చేస్తుంది.....అడవిలో ఒక కొండ శిఖరం ఎక్కి బావా నువ్వు నాకు చాలా ఇష్టం అంటూ ఆరవ మన్నాడు బావ భీమ్... వెంటనే పున్నాగ కొండ ఎక్కడం ప్రారంభించింది కొండ శిఖరాగ్రం చేరింది. ఏ మాత్రం కాలుజారిన కింద అగాధమైన లోయ అయినప్పటికీ పున్నాగ ఏమాత్రం దొరకక బావా అంటూ అరవడం మొదలు పెట్టింది.....
ఆర్తి నిద్రలో బావ అంటూ అరుస్తుంటే బస్సులో జనం వింతగా ఆమె వైపు చూశారు. ఆర్తి చుట్టూరా చూసుకుని తను నిద్రలో కలక న్నట్లుగా గుర్తుంచుకుని తన ఊహల్లో త నెప్పుడు అడివిలో వనకన్య గా పుట్టాలని అనుకునేది తన ఆలోచనలు తన కు కల రూపంలో వచ్చాయని తెలుసుకుని నవ్వుకుంది ఇంతలో బస్సు తన స్థానానికి చేరింది తను ఊహించినట్టుగా బస్సు ఏదో అవుతుందని భయపడిన తన భయాన్ని పోగొట్టి నందుకు కలలోని వనకన్య కు
ధన్యవాదాలు తెలుపుతూ బస్సు దిగింది ఆర్తి.
పేరు శ్రీమతి సత్యం మొం డ్రెటి
ఊరు హైదరాబాద్
చరవాణి 94 90 2 3 9 5 8 1