మూఢ నమ్మకాలు - గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

మూఢ నమ్మకాలు - గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

మూఢ నమ్మకాలు
〰️〰️〰️〰️〰️〰️〰️〰️

అజ్ఞానానికి మిగుల  ప్రతీకలు
అశాస్త్రీయము మూఢ నమ్మకాలు
పాడుచేయు పచ్చని జీవితాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

భువిలో ప్రగతికి ప్రతిబంధకాలు
మానవ మనుగడకే ప్రమాదాలు
నాశనము తెస్తాయి కాపురాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

బలి అవుతున్నారూ అమాయకులు
మోసపోతున్నారు ఇల అబలలు
వలమేస్తున్నారు కదా  నీచులు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

ఆపాలోయి ! మూఢ నమ్మకాలు
 కావాలోయ్! అప్రమత్తం  ప్రజలు
మారాలోయ్ ఇకనైనా మనుజులు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

జరుగుతున్నాయి ఘోర మోసాలు
అమాయక ప్రజలపై దారుణాలు
తరమాలోయి మూఢ నమ్మకాలు
చూడచక్కని తెలుగు సున్నితంబు!

-గద్వాల సోమన్న,
గణితోపాధ్యాయుడు.

0/Post a Comment/Comments