దేశ జాతి ఖ్యాతి చిహ్నం ---వి. కృష్ణవేణి, వాడపాలెం.

దేశ జాతి ఖ్యాతి చిహ్నం ---వి. కృష్ణవేణి, వాడపాలెం.


దేశ జాతి ఖ్యాతి చిహ్నం  

భారత ఆత్మ గౌరవానికి 
దేశ సమగ్రతకు సమైక్యతకు ప్రతీక జాతీయ జెండా..
జాతీయ పతకంలో వెలసిన
అశోక ధర్మచక్రం
క్రమ శిక్షణకు, ధర్మానికి, న్యాయానికి సాంకేతమై
సూర్యభింబానికి సూచికై..
కాషాయరంగు థైర్యానికి
త్యాగానికి
దేశభక్తికి ప్రతీకై..
తెలుపు రంగు శాంతికి, సత్యానికి చిహ్నమై...
ఆకుపచ్చరంగు నమ్మకానికి, సమృద్ధికి, 
భూమికి సంకేతమై వెలసింది జాతీయ జెండా..
ఎర్రకోట పై త్రివర్ణ పతాక రెపరెపలు ,
సకల జాతికి మార్గదర్శిగా..
శాంతి కేతనమై ఎగిరింది మువెన్నెల జెండా..
తుళ్ళింది జాతీయ పతాకం స్వతంత్ర
 భారతదేశమై!
స్వేచ్చగా హాయిగా ఉప్పొంగెను జాతీయ పతాకం గగన సీమ పై..
సహనం, శాంతి, సౌబ్రాతత్త్వ మై
మురిసింది  తానొక చిహ్నమై..
సమతా, మమతా సహజీవనమై 
సౌఖ్యమును చాటెను మన జాతీయ పతాకం.
ప్రగతి పథంలో పయనించమని బోధించి..
అన్యాయానికి తలవంచని మన త్రివర్ణ పతాకం
మన దేశ జాతి ఖ్యాతిని ఇనుమడింపచేసెను.

---వి. కృష్ణవేణి.
వాడపాలెం

ప్రక్రియ:వచన 


 

0/Post a Comment/Comments