అలలే ఆదర్శం!! --గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

అలలే ఆదర్శం!! --గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.అలలే ఆదర్శం!!
--------------------------------------

పడిలేచే సాగర కెరటాలు
నాకు ఆదర్శమవుతాయి
తీరం చేరాలనే అలుపెరుగని  
 అలల ఆరాటం
జీవితం పోరాటం నేర్పుతాయి
అపజయాల్లో జయం
అలల ధ్యేయం,
 విజయ రహస్యమవుతుంది
నిరాశల అమావాస్య లోంచి
నిండు పండు పున్నమి    
 వెన్నెలవుతుంది
ఆశావాద దృక్పథానికి
పునాది రాళ్లవుతాయి
సృష్టి జీవన్మరణాలకు
భాష్యం చూపుతాయి
" అలలే నాకాదర్శం "
ఆశల చిగురింపుకు ఆనవాలు
మోడుబారిన జీవితాలకు
అలలే ఆశాకిరాణాలు
అందరికీ స్ఫూర్తి ప్రదాతలు

 --గద్వాల సోమన్న ,
      ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments