శీర్షిక: మానవ జీవితపు బంగారు మెట్టు(పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

శీర్షిక: మానవ జీవితపు బంగారు మెట్టు(పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

 శీర్షిక: మానవ జీవితపు బంగారు మెట్టు


 
నిజమే మానవ జీవితాన్ని బంగారపు మెట్లు
అడుగడుగునా విజయానికి గట్లు
వాటిని పెంచాలి మన జీవనానికు తగ్గట్లు

చెట్లు కూల్చడం నరకడం ఆపాలి
మొక్కలు నాటడం పెంచడం తెలియాలి
ఏదైనా కూల్చుట సులువేనని గ్రహించాలి
నిలబెట్టుట కష్టమని తెలుసుకొని నడచుకోవాలి

చెట్లు ప్రకృతికి మానవాళికి జీవనాధారం
సక్రమ వర్షాలకు స్వచ్ఛమైన ప్రాణవాయువుకు చెట్లే ఆధారం
రైతన్నలు పంట పండాలన్న జనాల కడుపు నిండాలన్న వర్షం ఆధారం
ఆ వర్షానికి ఈ పచ్చని చెట్లే మూలాధారం

నేడు విజ్ఞానం కొత్త పోకడలు సంతరించుకుంటుంది
విజ్ఞానం పేరుతో వన నాశనం జరుగుతుంది
కాలుష్యం కోరలు చాపి కూర్చుంది
ప్రపంచమంతా విషవాయువులతో నిండుకుంది

ఓ మనిషి తెలుసుకో చెట్లు విలువ
అవి లేకుంటే లేదు నికు జీవితం విలువ
సకాలం లో అందివ్వని ఎన్నో అవసరాలను కోల్పోతావు
ఎంత డబ్బు ఉన్న ముఖ్యమైన వనరు తరువు లేకపోతే లేదు విలువ

స్వయం పోషకాలు చెట్లు
అవే మానవ ప్రగతికి మెట్లు
భవితకు బంగారు మెట్లు
తెలుసుకో తెరుకో తప్పించుకో అగచాట్లు

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          టీచర్ సాలూరు
           విజయనగరం జిల్లా
            9441530829

ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను.

0/Post a Comment/Comments