"మానవజీవన పోరాటం" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"మానవజీవన పోరాటం" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

మానవజీవన పోరాటం

సమాజంలో అసమానతలు సహజం
ఒక వైపు కూటికి లేనివాళ్లు
మరొక వైపు కోటికి పడగలెత్తినవాళ్ళు
వీళ్ళ మధ్య ఎప్పుడూ వైరుధ్యం
దీనివల్ల అశాంతి అల్లకల్లోలం
పేదలు ధనికులు శ్రామికులు బూర్జువాలనే
రెండు వర్గాల మధ్య సంఘర్షణ
కొన్ని జాతులు మరికొన్ని జాతుల వారిని
పీడించి ఆధిక్యతను ప్రదర్శించడం
అనాదిగా సాగుతోంది
అనంత సంగ్రామం
అనాధుడికి ఆగర్భ
శ్రీమంతుడికి మధ్య
సమాజంలో పీడకులు పీడితులు వున్నారు
పీడన ఏరూపంలోనూ
సమర్థనీయంకాదు
దేవుడిచ్చిన దాంతో జీవించకుండా
దేనికోసమో ఆరాటం
ఈజీవనపోరాటం
సమాజంలో ప్రతివారు
అభ్యుదయాన్నిపొంది
ఆనందమయ జీవితం
గడపాలని ఆకాంక్ష


ఆచార్య ఎం.రామనాథం నాయుడు, మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments