ఆంధ్రకేసరి (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

ఆంధ్రకేసరి (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

*ఆంధ్రకేసరి*

నిరుపేద కుటుంబం లో జనియించిన సామాన్యుడు
బ్రిటిష్ వారి గుండెల్లో నిధురపోయిన అసామాన్యుడు
ఆంధ్రకేసరిగా పేరుగాంచిన అనన్య సామాన్యుడు
ప్రకాశం పంతులు గారు మన టంగుటూరి వాస్తవ్యుడు 

ఇంగ్లాండ్ లో భారిస్టర్ పట్టపుచ్చు కున్న ప్రతిభాశాలి 
ఇంగ్లాండ్ లో  భారతీయ సొసైటీ లో చేరి
దాదాభాయ్ నౌరోజీ కి మద్దతు పలికి
బ్రిటిష్ పార్లమెంట్ కు ఎన్నికయ్యేలా ప్రచారాన్ని చేసేను.

చేరెను తదుపరి స్వాతంత్ర్య ఉద్యమం లో 
చేసెను సత్యాగ్రహప్రతిన పై సంతకం
చేసెను స్వరాజ్య పత్రికకు సంపాదకునిగా
ఖర్చు చేసెను లక్షల ఆస్తిని స్వాతంత్ర్య సమరయోధునిగా

నడిపెను జాతీయ పాఠశాల మరియు ఖాదీ ఉత్పత్తి
ఎన్నికయ్యేను కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా
పాల్గొనేను సహాయ నిరాకరణోద్యమం
నిర్వహించెను  ఒక అద్భుత ప్రదర్శన

అయ్యెను మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రి
స్థాపించెను తదుపరి స్వతంత్ర రాజకీయపార్టీ
సైమన్ గో బాక్ అని నినదించెను
రొమ్ము చూపి కాల్చమని సవాల్ విసిరిన ఆంధ్రకేసరి

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి
ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు చెందిన ధీరుడు
మేధావిగా ప్రజాసేవకుడిగా కీర్తి గడించిన మహోన్నతుడు
ప్రజల కన్నీటి తో అశ్రు నివాళులు అందుకున్న చిరస్మరనీయుడు

రచన: పసుమర్తి నాగేశ్వరరావు
 టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా
9441530829

ఇది నా స్వీయారచన. హామీ ఇస్తున్నాను

0/Post a Comment/Comments