రాఖీ రోజు. పేరు: సి. శేఖర్(సియస్సార్)

రాఖీ రోజు. పేరు: సి. శేఖర్(సియస్సార్)

 రాఖీ రోజు

ఆత్మీయత అనురాగం
అభిమానం ఆదరణ ఆనందం
అవనినంత నిండుకున్న వీడిపోని దేవుడిచ్చిన బంధం
చెరిగిపోని జ్ఞాపకాలను
హృదయ ముంగిలిలో పరచుకొని
అందమైన రంగవల్లుల్లా పెనవేసుకున్న పేగుబంధం
జీవితాన్ని సార్థకం చేసే అన్నాచెల్లెల్లా అక్కాతమ్ముళ్ళ
నక్షత్రాల కాంతులు నవోత్సోహ నూతనోత్తేజాలు సంబరమై అంబరాన్ని 
తాకేరోజు ఈ రాఖీ రోజు
సోదరభావం సమతాగీతం
అనుభవైకవేద్యంగా మనసునిండే మంచిరోజు
రాఖీ ఓ రక్షణ కవచం
రాఖీ ఓ భరోసా మంత్రం
ఊర్వినంత ఉల్లాసం నింపేది మమతలనల్లి వీడిపోనీక లతల అల్లుకునే స్వచ్ఛమైనది
విశ్వమంతా సౌజన్య పరిమళాలు వెదజల్లే పండగిది

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.


0/Post a Comment/Comments