అక్షరాంజలి -- నాగమణి జక్క

అక్షరాంజలి -- నాగమణి జక్కఅక్షరాంజలి


కలము అనే ఆయుధంతో అక్షరాలను అందిస్తూ...
సమాజ సంస్కృతిని పరిరక్షిస్తూ....
అవినీతి పాలన ఎదుర్కొంటూ
ప్రగతి పథంలో అక్షరాస్యతను పెంపొందిస్తూ......

స్త్రీలపై ఆకృత్యాలు ఎదిరించి....
రైతుల కన్నీట గాథలకు అక్షర రూపం ఇచ్చి...
ఉపాధి లేని యువత ఆర్తనాదాలు వినిపిస్తూ....
పేదరికపు కన్నీటి బాధలను ప్రశ్నిస్తూ....

అన్యాయాన్ని ఎదిరించే ఆయుధమై...
అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమిచ్చే వెలుగై...
సమాజానికి శుభము కలిగించే తోరణమై....
అన్యాయాలను ఎదురించే వజ్రాయుధమై....
సమ సమాజ స్థాపనకు బాటలు వేస్తూ....

ఉషోదయ మందు ప్రసరించే కాంతి కిరణం లా.....
వికసించే మందార మకరందాలు గా.....
ఆత్మవిశ్వాసానికి ఆభరణ మై...
నాలోని అక్షరాంజలి తో ఐక్యత భావమును నింపును.....


 -- నాగమణి జక్క

0/Post a Comment/Comments