స్నేహ సౌరభం ---రచన : మోటూరి నారాయణ రావు, జర్నలిస్టు, హైదరాబాద్.

స్నేహ సౌరభం ---రచన : మోటూరి నారాయణ రావు, జర్నలిస్టు, హైదరాబాద్.


స్నేహ సౌరభం 

చెడ్డిదోస్తానా ..
కలిసి మెలిసి 
గోటీలాడుకునే
చిలిపి చేష్టల 
పసి మనసత్వం 
మనసులను మెలివేసీ 
మాటలను పెనవేసీ 
లేని రక్తసంబంద
మాధుర్యాన్ని 
రుచిచూపేది స్నేహం 
గుండెలోతు బాధలను 
యదలోతు గాదలను 
ఒంటికైన గాయాలను
కడుపులోన మంటలను
విఫులంగా విరచించుకునే
సొదల సవ్వడి స్నేహం 
జలజలపారే జలపాతంలా 
కళకళలాడే కడలి కెరటంలా 
తళతళలాడే గోదావరి తరగలా
మిలమిలలాడే హిమవాహినిలా
సాగుతూ.. పాదుకునేది స్నేహం
మనసులోని భావాలు 
మధురమైన జ్ఞాపకాలు 
అందమైన అనుభవాలు
ఆత్మీయత,అనుభంధాలు 
అరమరికలకు తావియ్యని
నిస్వార్థ అక్షరం  స్నేహం 
 
ఏమిలేనప్పటి నుంచీ
అన్నీఉన్నప్పటి వరకూ
అమ్మా, నాన్నా, అర్ధాంగికి
చెప్పుకోలేక నలిగిపోయే
నరకయాతనకు పాతరేస్తూ
నీడలా.. తోడులా నిలిచే 
అమృతకలశమే స్నేహ సౌరభం

రచన : మోటూరి నారాయణ రావు 
ప్రాంతం : హైదరాబాద్ 
వృత్తి : జర్నలిస్టు 
చరవాణి :9346250304

0/Post a Comment/Comments