విశ్వ మాత...
శాంతి దూత
నోబెల్ గ్రహీత...
ఎందరో అభాగ్యుల మార్గ దాత...
మన మదర్ థెరిస్సా...!!!
శాంతి దూత
నోబెల్ గ్రహీత...
ఎందరో అభాగ్యుల మార్గ దాత...
మన మదర్ థెరిస్సా...!!!
అమ్మ అనే పదానికి ఆమె
ఓ పర్యాయ పదం.
అల్బేనియా లో పుట్టిన
ఈ పూవు...భారత దేశం లో వికసించి...
అభాగ్యులకు....
అనాథలకు....
అనారోగ్యులకు...
తన ఆపన్న హస్తం అందించిన త్యాగశీలి..
కష్టాల వూబిలో కూరుకుపోయి...
రోగాల బాధలో కృంగిపోతున్న వారికి
ఒక వెలుగు మార్గం చూపిన స్నేహశీలి...
ఆకలిగొన్న అభాగ్యులకు తానే
అమ్మ అయ్యి...అన్నమయ్యి...
వారి ఆకలి తీర్చిన పుణ్యశీలి...
నిర్మలమైన హృదయంతో....
"నిర్మల్ హృదయ్" స్థాపించి...
తన నిర్మలత్వాన్ని చాటుకున్న
నిర్మల మూర్తి.... "ప్రపంచానికే
అమ్మ అయిన మాతృ మూర్తి కి
ఇవే నా నమస్సుమాంజలులు..!!!"
--సత్య, హైదరాబాద్.