ప్రభుత్వ జూనియర్ కాళాశాల సివిక్స్ లెక్చరర్ వైద్య శేషారావుకు "పుడమి సాహితి వేదిక నల్గొండ వారి డాక్టర్. సర్వేపల్లి రాధా కృష్ణన్ జాతీయ పురస్కారం"

ప్రభుత్వ జూనియర్ కాళాశాల సివిక్స్ లెక్చరర్ వైద్య శేషారావుకు "పుడమి సాహితి వేదిక నల్గొండ వారి డాక్టర్. సర్వేపల్లి రాధా కృష్ణన్ జాతీయ పురస్కారం"


పుడమి సాహితీ వేదిక నల్గొండ తెలంగాణ రాష్ట్రం వారు డాక్టర్ సర్వేపల్లి రాధా కృష్ణన్ జాతీయ పురస్కారాలను 4.9.2021న అధ్యాపక వృత్తిలో  ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి ప్రాధానం చేస్తుంది. ఈ కార్యక్రమంలో పురస్కార ప్రదాతగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వ  సాంస్కృతిక సలహాదారు శ్రీ కె.వి. రమణా చారి పాల్గొంటారు. ఈ సంస్థ ఇచ్చే జాతీయ పురస్కారానికి కామారెడ్డి జిల్లా మరియు మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ జూనియర్ కాళాశాల సివిక్స్ లెక్చరర్ వైద్య శేషారావు ను 30 సంత్సరాల నుంచి బోధన వృత్తిలో ఎంతో మందిని తీర్చిదిద్దినందుకు గాను ఎంపిక చేసినారు. ప్రాథమిక స్థాయి, హై స్కూల్, జూనియర్, డిగ్రీ, ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థుల కు బోధిస్తూ, సాహిత్యంలో కూడా రాణిస్తున్నారు.

0/Post a Comment/Comments