బుల్లెట్స్ శ్రీమతి సత్య మొండ్రేటి

బుల్లెట్స్ శ్రీమతి సత్య మొండ్రేటి



వైద్యుడు  దైవము
ధన్వంతరి రూపము

జీవనోపాధి తీరాలు
సంపాదన వెతుకులాటలు

ఆచరణ రావాలి
అభ్యుదయం కావాలి

ఆశయ  సిద్ధి
కావాలి బుద్ధి

ఆడంబరాలు వద్దు
అవసరాల ముద్దు
              
అందమైన పల్లెటూరు
ఆప్యాయత పుట్టినూరు

జన్మలన్నిటి  కన్న
మానవజన్మ మిన్న
      
నాగరికత మోజు
సంప్రదాయ రివాజు

మదిలోని గాయాలు
మధురమైన గేయాలు

స్పందించిన భావాలు
నా మది  అనుభవాలు
                
అందరూ  నావాళ్ళు      ‌‌        
లేరు పరాయివాళ్ళు

శత్రువుల కక్ష
నేరానికి శిక్ష



0/Post a Comment/Comments