'తెలుగు భాష సేవా' పురస్కారం గద్వాల సోమన్నకు ప్రదానం
పెద్దకడబూరు మండలం, హెచ్. మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపా ధ్యాయుడుగా పనిచేస్తున్న బాలసాహిత్యవేత్త, కవిరత్న గద్వాల సోమన్న ను 'తెలుగుభాష సేవా' పురస్కారం వరించింది. 'తెలుగు భాషాదినోత్సవం, గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన తెలుగు 'భాషోద్యమం' అనే అంశంపై నూతన కవితాప్రక్రియలో సున్నితాలు లిఖించి గిడుగు వారికి సమర్పించి,తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్న సహస్ర రత్న గద్వాల సోమన్న సాహిత్య ప్రతిభను అభినందిస్తుతూ సాహితీ బృందావన జాతీయ వేదిక వారిచే "తెలుగు భాష సేవా" పురస్కారం వాట్సప్ వేదిక ద్వారా ప్రదానం చేయడమైనది. పురస్కార గ్రహీత గద్వాల సోమన్న ను సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.
Post a Comment