పిల్లలు ఉండేది పరిశ్రమల్లో కాదు పాఠశాలల్లో. ---ఉమశేషారావు

పిల్లలు ఉండేది పరిశ్రమల్లో కాదు పాఠశాలల్లో. ---ఉమశేషారావు

పేరు. ఉమశేషారావు
కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్ ఇన్ సివిక్స్
జి.జె.సి దోమకొండ


పిల్లలు ఉండేది పరిశ్రమల్లో కాదు పాఠశాలల్లో


మనం పత్రికల్లో,టి.వి ల్లో ప్రకటనల్లో 75 ఏళ్ల స్వా సంత్య్రం గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం.అయితే నేటి బాలురే రేపటి పౌరులు అనే నినాదం నామమాత్రం అయ్యింది దీనికి కారణం బాల కార్మిక వ్యవస్థ

బాలల శారీరక,మానసిక అభివృద్ధికి ఆటంకం అయ్యి కనీస అక్షరాస్యతను వినోదాన్ని కూడా పొందలేని  స్థితిని బాలకార్మిక వ్యవస్థ అంటాం.

ప్రపంచంలో పచ్చిమ ఆసియా,పసిఫిక్ దేశాలలో ఈ సమస్యతీవ్రంగా ఉంది.మన దేశం లో89 లక్షల మంది బాల కార్మికులు ఉన్నట్లు అంచనా వేసినారు.2009..2010 లో 5 నుంచి 14 సంత్సరాల లోపు బాల కార్మికుల సంఖ్య 49.84 లక్షలు దానిలో కూడా ఎస్.సి ల లో 55 శాతం,ఎస్.టి ల లో63 శాతం ఉంది మరింత సామాజిక అసమానతలు సృష్టిస్తుంది.స్వచ్చంద సంస్థలు ట్రేడ్ యూనియన్  ప్రకారం మన దేశంలో 6 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. బాల కార్మికుల్లో ప్రతి 10 మందిలో 9 మంది వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నారు.50 శాతం మంది ఎలాంటి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నారు

సూరత్ లోని వజ్రాలు చెక్కుడు, శివకాశిలోని మందుగుండు,కాశ్మీర్ లోతివాచిలు,ఇటుక బట్టిలు,ఇతరత్రా వాటిల్లో పనిచేస్తూనే ఉన్నారు.దీని ప్రభావం చేత క్షేయ,ఆస్తమా,బ్రాంకైటిస్,కళ్ళు చూపు మందగించడం లాంటి రోగాల బారిన పడుతున్నారు.

భారత దేశం లో మొట్టమొదటి సారిగా 1986 లో బాల కార్మిక చట్టాన్ని తయారు చేసి 8 రకాల వాటిని గుర్తించి వాటిలో బలకార్మికులను నిషేధించింది 2010 సంత్సరం లో కొన్ని సవరణలు చేసి సర్కస్,ఏనుగుల సంరక్షణ వంటి వాటిలో కూడా నిషేధించారు.

జాతీయ బాలకార్మిక ప్రాజెక్ట్ స్థాపించి12 జిల్లాల్లో ప్రారంభించారు దీనిలో 10 నెలల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు కొనసాగించారు దీని వ్యయాన్ని 75 శాతం కేంద్రం భరిస్తుంది

భారత రాజ్యాంగం లోని 24,39,45 నిబంధనలు బాలల హక్కులకు రక్షణ కల్పిస్తాయి.పీడనాన్ని నిరోధించే ప్రాథమిక హక్కు 24 వ నిబంధన 14 సంత్సరాల లోపు పిల్లలను పరిశ్రమల్లో పనిచేయించడం నిషేధించింది

విద్య హక్కు చట్టాన్ని 2009 ప్రవేశ పెట్టి 8వ తరగతి తర్వాత ఉన్న డేటెన్షన్ పద్ధతి తొలిగించింది అయితే 1986 బాల కార్మికులు 6 గంటల విశ్రాంతి సమయాల్లో పని చేయవచ్చు అనే అవాకాశము ఉంది అందుచే దాన్ని పూర్తిగా తొలిగించే విధంగా సవరణ చెయ్యాలి

యునెస్కో ప్రతి సంత్సరం జూన్ 12 నాడు అంతర్జాతీయ బాల కార్మిక దినోత్సవాన్ని జరుపుతోంది.ఐ.ఎల్.ఓ2021 సంత్సరాన్ని  బాల కార్మిక నివారణ సంత్సరంగా ప్రకటించి 20215 వరకు ప్రపంచంలో బాల కార్మికులు ఉండకూడదు అని నిర్ణయించుకొంది. అంగన్వాడీ లు,గురు కులుల,నవోదయ,ప్రత్యేక పాఠశాలలు,నియత,అనియత పద్ధతుల ద్వారా ,అక్షరాస్యత మిషిన్ ల ద్వారా ప్రభుత్వాలు కృషి చేస్తూనే ఉన్నాయి

ఎం.వి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ గ్రహీత శాంత సిన్హా 500 గ్రామాలను దత్తత తీసుకొని బాల కార్మికుల విద్య ఆర్ధిక అభివృద్ధికి కృషిచేస్తున్నాయి,నోబెల్ బహుమతి అందుకున్న కైలాస్ సత్యార్థి కూడా ఈ రంగం లోనేఅందుకున్నారు

   ఇది ఒక చిన్న సమస్య గా చూడకుండా,పౌరసమాజం,కుటుంబం బాధ్యతగా తీసుకొని బాల కార్మిక వ్యవస్థకు కంకణ బద్ధులు అయి కృషి చేయాలి లేకుంటే భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఏర్పడు తుంది.భేటిబచావ్..భేటి పాడావ్ విస్తృతంగా ప్రజల్లో కి తీసుకెళ్లాలి

0/Post a Comment/Comments