భారత స్వాతంత్ర్య సమరయోధుల పై వ్యాసం
భగత్ సింగ్ 1907_సెప్టెంబర్ 28 మార్చి 23_1931
భగత్ సింగ్ స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రఖ్యాత ఉద్యమకారుడు. మండే అగ్నిగోళం జ్వలించే నిప్పు కణిక. ఢిల్లీ వీధిలో ఎర్రకాగితాలు చల్లి ప్రజలను చైతన్య పరిచాడు. విప్లవం వర్ధిల్లాలి అనే నినాదాన్ని ఇచ్చింది కూడా భగత్ సింగే. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన విప్లవకారులలో ఆయన ఒకడు. ఈకారణంగానే షహిద్ భగత్ సింగ్ గా కొనియాడబడుతున్నాడు.
భగత్ సింగ్ హిందుస్తాన్, సోషలిస్టు రిపబ్లికన్ పార్టీ స్థాపక సబ్యులలో ఒకడు. పాకిస్తాన్ లో ఉన్న లాయర్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. బ్రిటిష్ పాలనను వ్యతిరేకంగా ఉద్యామాలు చేపట్టిన కుటుంబంలో జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా, విప్లవ ఉద్యమాలను గూరించి చదివి ఆకర్షితుడయ్యాడు. భరతజాతిని దాస్యవిముక్తి గావించడానికి బ్రిటీష్ వారికి సవాలు విసిరాడు. యువపోరాటయోదుడై స్వాతంత్ర్య సమరంలో విప్లవాగ్నిని జ్వలింపజేసిన మేటీ దేశభక్తుడు భగత్ సింగ్. భగత్ సింగ్ పెళ్ళి చేసుకోకుండా "నాజీవితం నాదేశానికి అంకితం చేస్తాను నాకు ఇంకే కోరికలేదని" ఉత్తరం రాసి ఇంటినుండి వెళ్ళిపోయాడు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాసాలు రాశాడు. స్వాతంత్ర్య ఉద్యమకారుడిగా,తిరుగుబాటు దాసుడిగా"ఇంక్విలాబ్ జిందాబాద్ "అని నినాదాలు చేశాడు.
భగత్ సింగ్ నకు ఆశలు, ఆకాంక్షలు అందమైన జీవితాన్ని గడపాలని ఉంది. అయితే అవసరమొచ్చినప్పుడు త్యజించగలను ఇదే అసలైన భూదానం అని దేశంమీద తనకు ఎంత ప్రేమ ఉందో తెలిపాడు. ఆ తర్వాత జైళ్ళొ "నావిడుదలకన్న నామరణం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కులదోస్తుందని నా విశ్వాసం" అని అంటాడు భగత్ సింగ్. ఆయనని ఉరి తీసే సమయంలో నేను చనిపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుందని" ఇంక్విలాబ్ జిందాబాద్ "అంటూ ఉరికొయ్యను ముద్దాడారు.
పేరు: పసుల లాలయ్య
(ఉస్మానియా తెలుగు రచయితల సంఘం సభ్యులు),
గ్రామం: అనంతపూర్, మం:బొంరాస్పేట్,
జిల్లా: వికారాబాద్, చరవాణి: 7893999525.