*రాఖీ పండగ పర్వదినం* --ఎన్.రాజేష్-ఎమ్మెస్సి

*రాఖీ పండగ పర్వదినం* --ఎన్.రాజేష్-ఎమ్మెస్సి

*రాఖీ పండగ పర్వదినం*

బంధాలను బలోపేతం చేసే అనుబంధం
ప్రేమను పంచే అనురాగం 
ఆత్మీయత పంచే మమకారం..
అన్నీ కలగలిసిన అపురూప పర్వం "రక్షాబంధనం".

తొడబుట్టిన వారిని దగ్గర చేసే పర్వదినం..
అన్నచెల్లెల్ల అక్కతమ్ముళ్ల మధ్య 
ప్రేమ-ఆప్యాయతలు పంచే శుభదినం.

సోదరులు చేపట్టే ప్రతి సత్కార్యం 
సాధించాలి విజయం అని కోరుతూ 
గుర్తుగా కట్టే రాఖీబంధనం సోదర సోదరిల మధ్య 
ముడిపడిన బంధంను గుర్తుచేయు పర్వం.

సోదరసోదరీమణుల మధ్య
జరుపుకునే ఈ పర్వదినం
గుర్తుగా రాఖీని కట్టి రక్షణ
కల్పించమనితెలిపేసందర్భం

అనురాగం ఆప్యాయత కలబోసిన
ఈరాఖీ పర్వదినం
ప్రతి ఇంటా వెల్లి విరియాలి
ఆనందం..!
శుభములనిస్తూ కలగాలి
సంతోషం..!!

- ఎన్. రాజేష్,ఎమ్మెస్సి,
 కవి,జర్నలిస్ట్, హైదరాబాద్.
 

0/Post a Comment/Comments