నిజం
నిజం చెబితే నేరమా
నిజం నిష్టూరమా
నిజానికె నిజమంటే భయమా
నిజం నిప్పులాంటిదా
అవును నిజం చెబితే నేరమే అంటారు
యదార్ధావాది లోకవిరోధి సామెత కూడా వినే ఉంటారు
మరి ఎలా వుండమంటారు
ఎలా నడుచుకోమంటారు
ఒప్పు మాటాడితే నేడు పెద్ద తప్పు
ఒప్పు తెస్తుంది చెప్పలేని ముప్పు
తప్పే నేడు అసలు ఒప్పు
తప్పు చేసి తప్పుకొనుటయే నేటి ఒప్పు
హరిశ్చంద్రుడు పుట్టిన దేశం
శ్రీరాముడు ఏలిన రాజ్యం
గాంధీజీ కోరుకున్న స్వరాజ్యం
మహాత్ములును కన్న మహోన్నత దేశం ఈ దేశం
అహింసో పరమో ధర్మః
ధర్మం శరణం గచ్ఛామి
సత్యమేవ జయతే
ఇవే మన హిందూ దేశ సూక్తులు
తరతరాల లోకోక్తులు
సత్యం శివమ్ సుందరం
రఘుపతి రాఘవ రాజారామ్
మాధవులే మానవులుగా జనియించిన దేశం
అందుకే నిజాన్ని నిర్భయంగా చాటి చెపుదాం.
నిజం నిష్టూరం కాదు నిప్పు అని సగర్వంగా చెప్పే రోజు రావాలి తేవాలి కావాలి
--- పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా
9441530829