జీవిత రక్షణి -అనుబంధాల అపురూపిణి --వి. కృష్ణవేణి

జీవిత రక్షణి -అనుబంధాల అపురూపిణి --వి. కృష్ణవేణి



జీవిత రక్షణి -అనుబంధాల అపురూపిణి.

అమ్మగా లాలించగా 
అక్కగా ఆదరించగా 
తోబుట్టువుగా ప్రేమను పంచగా
జీవితాంతం నీకు తోడై నీ రక్షణ నాదిగా
నాకు బాధ్యత గా మెలగానా
నీవే నాకు రక్షకుడు గా
బాధ్యతలను మోసే నాన్నగా
నన్ను రక్షించే సంరక్షకుడుగా
ఉంటూ నన్ను కాపాడి వెన్నంటే తోడు నీడై
జీవితానికి భరోసా ఇస్తూ
బంధానికి, అనుబంధానికి విలువనిస్తూ
ప్రేమను, ఆప్యాయతను కురిపిస్తూ...
ముసిముసి నవ్వులకు బామ్మ నై కథలుచెప్పగా...
తప్పడడుగులకు ఆలాపన చేయగా...
తప్పుడడుగులకు సరిదిద్దులు నేర్పగా....
గోరుముద్దలు తినిపిస్తూ అనురాగాన్ని పంచగా....
అనుబంధాల హరివిల్లుకి మన అక్కాతమ్ముళ్ల బంధము ఒక ప్రతీక కావాలని..
జన్మ జన్మలకు ఒకరికొకరు రక్షణ,ఆదరణ కావాలని...
మరు జన్మకైనా విడిపోని మర్చిపోని అమ్మ ఆలాపనగా...
జీవితాంతం తోడుండే నాన్న ప్రతిరూపంగా
ఇద్దరి రక్తసంబంధం , వీడిపోని ఒకే ప్రాణంగా
ఆత్మీయతకు మారు పేరుగా నిలుద్దాం...
సోదరసోదరి భావాన్ని చాటుకుంటూ అనుబంధాన్ని నిలుపుకుందాం....



వి. కృష్ణవేణి
వాడపాలెం.
ప్రక్రియ :వచనం..

 

0/Post a Comment/Comments