స్నేహబంధం... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

స్నేహబంధం... పోలయ్య కవి కూకట్లపల్లి... అత్తాపూర్ హైదరాబాద్

స్నేహబంధం...

ఓ ప్రియనేస్తమా !
నిన్న నీవన్నావు
స్నేహాన్ని...పువ్వుతో...పోల్చకు
అది వాడిపోతుందని...
కాని నేడు నేనంటున్నాను
స్నేహాన్ని...పువ్వుతో...పోలిస్తే అది
మన మనసును పరిమళింప చేస్తుందని...

ఓ ప్రియనేస్తమా !
నిన్న నీవన్నావు
స్నేహాన్ని...మంచుతో...పోల్చకు
అది కరిగిపోతుందని...
కాని నేడు నేనంటున్నాను
స్నేహాన్ని...మంచుతో...పోలిస్తే అది
మన హృదయానికి చల్లదనాన్నిస్తుందని...

ఓ ప్రియనేస్తమా !
నిన్న నీవన్నావు
స్నేహాన్ని...ఆకుతో...పోల్చకు
అది రాలిపోతుందని...
కాని నేడు నేనంటున్నాను
స్నేహాన్ని...ఆకుతో...పోలిస్తే అది మన
జీవితానికి పచ్చదనాన్ని పంచుతుందని...

ఓ ప్రియనేస్తమా !
ఇకనైనా ఓ నిజం తెలుసుకో
స్నేహాన్ని...టానిక్ తో...పోలిస్తే
అది మనకు అంతులేని శక్తినిస్తుందని...
స్నేహాన్ని...అమృతంతో...పోలిస్తే
అది మృత్యుభయం లేకుండ
మనల్ని ముందుకు నడిపిస్తుందని...ఇక
దేనితో పోల్చుకోవాలో నీవే తేల్చుకో నేస్తమా!

కానీ ఓ ప్రియనేస్తమా !
ఈ మన స్నేహమే కదా ! నిస్వార్థమైన
స్నేహానికి చెరగని చిరునామా అందుకే
ఈ "స్నేహబంధం"నిలిచిపోవాలి కలకాలం
ఈ భువిలో సూర్యచంద్రులున్నంతకాలం !
ఆ దివిలో నక్షత్రాలు నవ్వుతున్నంత కాలం !
అందుకే మరువకు ఓ ప్రియనేస్తమా !
స్నేహమే జీవితమని ఈ స్నేహమే శాశ్వతమని !

రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502

(స్నేహితుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలతో)

0/Post a Comment/Comments