ప్రేమైక మూర్తి --భీమవరపు జ్యోతి, పెద్దపల్లి.

ప్రేమైక మూర్తి --భీమవరపు జ్యోతి, పెద్దపల్లి.

మదర్ థెరిస్సా జన్మదినం
సందర్బంగా.......

ప్రేమైక మూర్తి

ఎక్కడో 
యుగోస్లేవియాదేశములో పుట్టి
భారతదేశాన్ని తన సేవా 
మార్గానికి శాశ్వత స్థానమని
తెలుసుకొని పడరాని పాట్లు పడుతూ
ఊరు కానీ ఊరు
దేశం కానీ దేశము వచ్చి
భాష రాకున్నా భావము తెలియకున్నా
ప్రేమా భిమానాలు
సోదరత్వం సమానత్వమే
ప్రపంచ భాష అని నమ్మి
మానవత్వము పరిమళించేట్లు
అనాధలను ఆకలితో ఉన్నవారిని 
అక్కునచేర్చుకొని
పరిసరాల శుభ్రతా పాఠాలు
చెబుతూ వారిని వీరిని అడిగి
అభాగ్యుల కడుపు నింపి
బ్రతుకు పాఠాలు చెప్పి
అనాధలకు ఆమ్మ లా
కుష్టురోగులకు  కల్పవల్లి వోలె
వృద్దులకు తోడు నీడ లాగా
అడగకుండానే అన్నార్తులకు 
అభాగ్యుల జీవితాల్లో 
వెలుగునింపిన  కరుణామయి
యవ్వన దశలో వచ్చి
శాశ్వత నిద్ర వరకు 
భారతదేశాన్ని కన్నతల్లిగా భావించి 
అపూర్వమైన సేవలందించిన మాతృమూర్తి
భారతదేశ సుపుత్రి 
మదర్ తెరిస్సాకు 
జయహో జయహా

**********************
భీమవరపు జ్యోతి
తెలుగు భాషో పాధ్యాయురాలు
జి ప ఉ పా బాలుర
పెద్దపల్లి

0/Post a Comment/Comments