బడి గంట మ్రోగింది
---------------------------------
బడి గంట మ్రోగింది
బడి తల్లి మురిసింది
చిన్నారులను చూసి
చిరునవ్వు నవ్వింది
కళకళలాడెను బడి
చిట్టి దేవతల గుడి
విజ్ఞాన మొలకల మడి
సరస్వతి మమతల ఒడి
బడి ఆకాశంలో
బాల తారల కాంతి
వచ్చెను ఈ వేళ
బాలలకు సంక్రాంతి
చిన్నారుల నవ్వులు
గంటల్లా గలగల
విరిసెను చిన్నారుల
మోముల్లో కిలకిల
ఈ వత్సరమైనా
సజావుగా సాగేనా?
బాలల చదువులకు
విఘాతం తప్పేనా?
--గద్వాల సోమన్న
(AP లో పాఠశాలల ప్రారంభం నేపథ్యంలో)