తెలుగుభాష మాధుర్యం
మధురమైనది తెలుగు
మరువలేనిది తెలుగు
మరచిపోరానిది తెలుగు
మనసైనది మన తెలుగు
అచ్చులు హల్లుల భాష
అమరిక ఉన్న భాష
వ్యాకరణం గల భాష
అలంకారం ల భాష
పద్య గద్య గలభాష
పరిణితి చెందిన భాష
ఒంపు సొంపుల భాష
సొగసైన తెలుగు భాష
సాహిత్యమైన భాష
రసరమ్యమైన భాష
నుడికారముల భాష
సుగంధమయమైన భాష
సరళమైన తెలుగుభాష
సరసమైన తెలుగుభాష
సరియైన తెలుగుభాష
సుమాలమాలల భాష
అవసరమైన తెలుగుభాష
అందమైన తెలుగుభాష
అణకువైన తెలుగుభాష
అందరూ మెచ్చే భాష
ఆరుకోట్ల తెలుగుభాష
లెస్స పలికే భాష
కవులునచ్చే తెలుగుభాష
గమ్మత్తైన తెలుగుభాష
రాయలుఏలినభాష
విశ్వనాధుని భాష
సినారె గల తెలుగుభాష
విశ్వంభరమైనభాష
వేమన గారి శతకాలు
శ్రీశ్రీ గారి కవనాలు
చిన్నయసూరి నీతులు
తిక్కన గారి రీతులు
తెనాలి గారి హాస్యం
ధూర్జటి గారి జోస్యం
పెద్దన గారి భాష్యం
ఇదే తెలుగు రాజసం
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
సాలూరు టీచర్
విజయనగరం
9441530829