ఎగురుతోంది జెండా పేరు: సి. శేఖర్(సియస్సార్)

ఎగురుతోంది జెండా పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక:ఎగురుతోంది జెండా


దేశమంతా ఒక్కటై 
దేహమంతా దేశభక్తై
ద్వేశన్నంతా పక్కనెట్టి
దేశ గౌరవం నిలబెట్టి
దేశభక్తి గీతాలనాలపించి
దేశభక్తులను నెమరేసుకొని
జాతీయపతాకమెగరగ
వందనమొసగిరి సుందరదేశ
భారతీయులందరు భక్తితోడ

వీదివీదిన మూడు రంగుల రెపరెపలు
విశ్వవీదిలో స్వేచ్ఛ స్వతంత్ర సంబరాలు
పింగళి మదిలో ఆలోచనల రూపమది
ఐక్యత ఎదలో అంకురించిన బావమది

బిన్నమైన మనుషులందరికి
స్వచ్ఛమైన మానవత్వమది
పేద ధనిక రంగు రూపం లేదని
ఏది కాదని అంతా దేశమేనని
చాటిచేప్పిన త్యాగధనులు
రంగులనన్ని ఏకంచేసి జెండా చేసిరి
భరతమాత భవిష్యత్తుకై బాటలు వేసిరి
అన్నిపూవులను జెండలో చుట్టిరి
ఆకాశంలోకి ఆనందంగా ఎగురవేసిరి
జెండా ఎగరగా నక్షత్రాలై పూవులు రాలెను
కరతాళధ్వనులతో తలెత్తుకుని జెండాకందరు వందనమొసగిరి

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు, 
9010480557.


0/Post a Comment/Comments