ప్రతిరూపం(వచనకవిత) --డా. రామక కృష్ణమూర్తి

ప్రతిరూపం(వచనకవిత) --డా. రామక కృష్ణమూర్తి

ప్రతిరూపం(వచనకవిత)
డా.రామక కృష్ణమూర్తి
బోయినపల్లి,మేడ్చల్.


నీవొక కృష్ణశాస్త్రి గాఢతలా,
విశ్వనాథ పాకంలా,
గురజాడ ముత్యాల సరంలా,
శ్రీశ్రీ అభ్యుదయంలా,
సినారె కవితలా,
ఆత్రేయ మనసులా,
ఆరుద్ర సాహిత్యంలా,
అలిశెట్టి మినీకవితలా,
జంధ్యాల అల్లికలా,
తిలక్ వెన్నెల్లో ఆడపిల్లలా,
కందుకూరి సంస్కారంలా,
వేటూరి పాటలా,
దాశరథి మాటలా,
నండూరి గేయంలా,
జాషువా పద్యంలా,
బుచ్చిబాబు పాత్రలా,
రాచకొండ నడకలా,
పానుగంటి వ్యాసంలా,
శేషేంద్ర మానిఫెస్టోలా,
దువ్వూరి చిత్రణలా,
రామానుజరావు తోరణంలా,
శివారెడ్డి గీతంలా,
చాసో కథలా,
నండూరి ఎంకిలా,
అన్పిస్తావు,కన్పిస్తావు.

హామీపత్రం:
పై వచనకవిత నా స్వంత రచన.దేనికీ అనువాదం,అనుకరణ కాదు.

0/Post a Comment/Comments