తెలుగు భారతికి ! నా అక్షర హారతి!!
నా తెలుగు భాష! నా జాతి ఆత్మ ఘోష!
నా తెలుగు యాస! నా జాతి జీవనశ్వాస!
నేను తెలుగువాన్ని! నా భాష తెలుగు భాష!
యాబైఆరు అక్షరాలే! నాతెలుగుజాతికి వరాలు!
ఆ అక్షరాలే...
నా తెలుగునేలపై కురిసిన విరిజల్లులు!
ఆ అక్షరాలే...
నా తెలుగుజాతి గుండెల్లో విరిసిన హరివిల్లులు!
ఆ అక్షరాలే...
నా తెలుగుతల్లి సిగలో మురిసే ముద్దమందారాలు!
నా కవులు వ్రాసిన పద్యాలే...
నా తెలుగుతల్లికి సమర్పించే పారిజాతపుష్పాలు!
నా తెలుగు పండితుల కావ్యాలే బృహత్ గ్రంథాలే...
నా తెలుగుతల్లికి అలంకరించే పట్టుపీతాంబరాలు !
నా తెలుగు సంస్కృతే...
నా తెలుగుతల్లి నుదుట దిద్దిన కుంకుమతిలకం!
నా తెలుగు సాంప్రదాయాలే...
నా తెలుగుతల్లికి వెలకట్టలేని బంగరు ఆభరణాలు!
నా తెలుగు గాయకులు ఆలపించే మధురగీతాలే...
నా తెలుగుతల్లి మెడలో మెరిసేటి పూలహారాలు!
ఏమని వర్ణింతు తెలుగుభాష వైభవం తెలుగువాడిపౌరుషం!
తెలుగుతల్లి కడుపున పుట్టడం మన పూర్వజన్మ సుకృతం!
ఎక్కడ తెలుగు వుంటుందో! అక్కడ వెలుగు వుంటుంది!
ఎక్కడ వెలుగు వుంటుందో! అక్కడ వికాస ముంటుంది!
అందుకే ఆ తల్లికి ప్రణామం !..ప్రణామం!... ప్రణామం!...
నా తెలుగుతల్లికి వందనం! అభివందనం!పాదాభివందనం!
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502