"గాడిద చాకిరి - మడివిలి వృత్తి" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"గాడిద చాకిరి - మడివిలి వృత్తి" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

గాడిద చాకిరి - మడివిలి వృత్తి

రైతుల మాసిన బట్టలు ఉతకడం
కుల వృత్తిగా ఎంచుకున్న మడివిలోళ్లు
గాడిదలు ఉప్పు మూటలు మోసినట్టు
బట్టల మూటలు మోసే
దయనీయ బతుకు రజకులది
బట్టలుతకడంలో నేర్పరితనం
లెక్కపెట్టి ఇవ్వడంలో చురుకుతనం
మన మడివిలన్న సొంతం
చదువుకున్న వారి కంటే
చాకలి మేలనే నానుడిని
అక్షర సత్యం చేసిన వాళ్ళు
రైతుల శుభ అశుభ కార్యాలలో
దివిటీలు వెలిగించే వాళ్ళు
మడివిలి వృత్తికి సాక్షీ భూతం
చాకిరేవుల చాకి బండలు
కుల వృత్తికి సాటిలేనిది ఏదీ
లేదంటారు కానీ ఆ
కులవృత్తులన్నీ నేడు
కనుమరుగయ్యాయి


ఆచార్య ఎం.రామనాథం నాయుడు , మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments