నా తెలుగు భాష -- వీ.వీ.ప్రసాదరావు ( చైతన్య ) ఇంగ్లిష్ లెక్చరర్. కాకతీయ డిగ్రీ, పీ జీ కాలేజి సత్తుపల్లి

నా తెలుగు భాష -- వీ.వీ.ప్రసాదరావు ( చైతన్య ) ఇంగ్లిష్ లెక్చరర్. కాకతీయ డిగ్రీ, పీ జీ కాలేజి సత్తుపల్లి           నా తెలుగు భాష
            ----------------------
    అమ్మ అధరాలపై కమ్మనైనది
    నా తెలుగు భాష
    జుంటి తేనియలా మధురమైనది
    నా తెలుగు భాష
    సుస్వరాలతో సుందర రాగం పలికించేది
    నా తెలుగు భాష
    సకల భాషావనంలో సుందరంగా భాసిల్లేది
    నా తెలుగు భాష
    కవిగాయక,వైతాళిక కలంలో
    జాలువారే జలతారు వెన్నెల 
    నా తెలుగు భాష
    అక్షరాల పూదోటలో 
    అరవిరిసిన ఉన్మీల అరవిందం
    నా తెలుగు భాష
    జనజీవన స్రవంతిలోకి జీవనబ్రాలు
    అపరంజి లాంటి నా తెలుగు భాష
    తెలంగానం యాసలో
    జానపదుల జావళిలో
    ప్రభందాల మధురిమలొ
    వెలుగుజిలుగులు విరజిమ్మే కాంతిపుంజం
    నా తెలుగు భాష
    ఎన్నడు వన్నె తరగని కమ్మని వెన్నలాంటి
    సాటిలేని కమ్మదనాల అమ్మభాష
    తియ్యందనాల నా తెలుగు భాష.
                 ***************

     వీ.వీ.ప్రసాదరావు ( చైతన్య )
     ఇంగ్లిష్ లెక్చరర్.                                 
     కాకతీయ డిగ్రీ, పీ జీ కాలేజి
     సత్తుపల్లి
     ఖమ్మం జిల్లా
     తెలంగాణ రాష్ట్రం
     మొబైల్ 9701099310
     
     

0/Post a Comment/Comments