రక్షాబంధనం
ఈ రక్షే నీకు శ్రీరామ రక్ష అంటూ కట్టింది రక్షాబంధనం!
నీవు వేసే అక్షతులే నా రక్షణకు సాక్షీభూతాలవ్వాని కట్టింది రక్షాబంధనం!!
కాలం ఎంత మారినా నువ్వు తన పక్షానే ఉండాలని కట్టింది రక్షాబంధనం!
ఏ కక్షా కార్పణ్యాలు మన బంధాన్ని విడదీయకూడదంటూ కట్టింది రక్షాబంధనం!!
పదికాలాలు పాటు నువ్వు లక్షణంగా ఉండాలని కట్టింది రక్షాబంధనం!
తనమీద ఉన్న ఈ ఆపేక్ష కలకాలం ఇలాగే ఉండాలని కట్టింది రక్షాబంధనం!!
ఏ రాక్షసుల కళ్ళు నీ మీద పడకూడదని కట్టింది రక్షాబంధనం!
దయాదాక్షిణ్యాలు లేని వాళ్ళ బారినుండి తనను సంరక్షించాలని కట్టింది రక్షాబంధనం!!
---- కొత్తపల్లి రవి కుమార్
రాజమహేంద్రవరం
9491804844