నేటి తరం బంధుత్వాలు

నేటి తరం బంధుత్వాలు


- మార్గం కృష్ణ మూర్తి

అంశం: నేటి తరం బంధుత్వాలు

జనాభా పెరగడం , ఉమ్మడి కుటుంభాలు కనుమరుగవడం , ఒంటరి కుటుంభాలు పెరుగుతుండటం వలన నేటి తరం బంధుత్వాలు మసక బారి పోతున్నాయి. అవసరాల కోసం
ఏర్పడిన తాత్కాలిక బంధుత్వాలుగా మారి పోతున్నాయి. నేటి తరం బంధుత్వాలు యాంత్రిక మైపోతున్నాయి.

ఎవరికి ఏమవుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడో ఒక సారి కలిసి నపుడు పరిచయం చేస్తే , ఓహో , అంటున్నారే తప్పా మరల గుర్తు పెట్టుకోవడం లేదు. కొందరు పెద్దలకే
వారి బంధువులు ఏమవుతవుతారో తెలియక
నేల చూపులు చూస్తున్నారు.

ఆందుకు కారణం , తల్లి తండ్రులకు , వారి తల్లిదండ్రులపై ప్రేమలు , ఆప్యాయతలు , గౌరవం లేక పోవడమే. మరో కారణం వ్యక్తిగత ఆర్ధిక స్థోమతలలో వ్యత్యాసం ఉండటం.
ఇగో , అక్షరాస్యతలో , పరిశుభ్రతలో , కల్చర్ లో తేడాలు ఉండటం , పట్టణం , పల్లెటూరు తేడాలు ఉండటం, పెద్దలపై అవసరాలు లేకుండా  ఉండటం మొదలైన ఎన్నో కారణాలు కనబడుతున్నాయి.

ఇలాంటి చిన్న చిన్న కారణాల వలన , పిల్లలకు , వారి తల్లిదండ్రులు లేదా అత్తా మామలకు గాని పరిచయం మరియు వరుసలు తెలియజేయక పోవడం వలన , ఎవరికి ఏమవుతారో తెలియక , పెద్ద పెరిగాక  ప్రేమ , దయ కరుణ , ఆప్యాయతలు ఉండటం లేదు. పెద్దలంటే గౌరవం
ఉండటం లేదు. ఆ బంధుత్వాలు దూరమవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో , కరోనా మహామ్మారి కూడా బంధుత్వాలను మరింత దూరం చేసింది.
కరోనా వచ్చినా , గతించినా వెళ్ళలేని పరిస్థితి. మా ఆపదలకు , అవసరాలకు రాలేదని , మరింతగా బంధుత్వాలు దూరమవుతున్నాయి.
తల్లి దండ్రులే , వారి తల్లిదండ్రులకు ప్రేమలు పంచుతే , గౌరవం ఇస్తే  పిల్లలు అనుక రించడానికి అవకాశం ఉంటుంది. బంధుత్వాలు బలబడుతాయి.

లేదంటే,  మరో 10, 20 సం.రాల తరువాత చూస్తే , ఇప్పటి వరకు ఉన్న ఒక తరం బంధాలు కూడా లేకుండా పోయే ప్రమాదం ఉంది.

పండుగలు పబ్బాలు , పెళ్ళిళ్ళు పేరంటాలు , వినోదాలు , ఉత్సవాలు , శుభకార్యాలు , సంస్కృతి , ఆచార సాంప్రదాయాలు బంధుత్వాలను పెంచుతాయి. వీటిని ఉన్నంతలో ఘనంగా జరుపుకోవాలి. వాట్సప్ మెస్సేజ్ లు పెట్టడం , ఇమేజ్ లు పెట్టడం కంటే ఫోన్ చేసి పిలువాలి. ఇంటికి పోయి మాట్లాడి రమ్మని పిలువాలి.

బంధుత్వాన్ని మించిన బంధం , రక్త సంబంధాన్ని మించిన అనుబంధం మరొకటి లేదు.

మార్గం కృష్ణ మూర్తి
హైదరాబాద్
0/Post a Comment/Comments