శ్రావణ సౌభాగ్యము__నాగమణి జక్క

శ్రావణ సౌభాగ్యము__నాగమణి జక్క



*శ్రావణ సౌభాగ్యం*


శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చె
స్కాంద పురాణము న శివుడి వివరించె
త్రికరణశుద్ధిగా చారుమతి పూజించె
అష్టైశ్వర్యాలనీ వర అష్టలక్ష్ములు రూపమున ఇచ్చె

అభయ వరద ముద్రలతో 
ధరించే పద్మ పతాకము లను
చతురస్త్రాల తో దర్శనమిచ్చే
      ఆది వరలక్ష్మి రావమ్మా

అనంత పరబ్రహ్మ స్వరూపిణిగా
ధరించె వరి చెరుకు అరటి లను 
హరిత వస్త్రాలతో దర్శనమిచ్చే 
     ధాన్య వరలక్ష్మి రావమ్మా

శంకు చక్రాలు ధనుర్భాణాలు గా
ధరించే పుస్తక త్రిశూలము లను
అరుణ వర్ణముతో దర్శనమిచ్చే
    ధైర్యవరలక్ష్మి రావమ్మా

ద్వి గజా అభిషేకము లతో
ధరించే పద్మములు ద్వి హస్తాలతో
రాజ్య ప్రదాతగా దర్శనమిచ్చే
     గజవరలక్ష్మి రావమ్మా

ద్వి కలశాలతో, షష్టమ హస్తాలతో
ధరించే ఖడ్గమును, డాలును
ఒడిలో బిడ్డతో దర్శనమిచ్చే
    సంతానవరలక్ష్మి రావమ్మా

శంకు, చక్ర, ఖడ్గ, డాలు,
పాశం తో జయ అభయముద్ర 
అష్ట కరములతో దర్శనమిచ్చే
    విజయవరలక్ష్మి రావమ్మా

చదువుల తల్లి శారదా దేవి గా
ధరించే కరమునందు కచ్చపి తో
ధవళ వస్త్రాలతో దర్శనమిచ్చే
    విద్యావరలక్ష్మి మీ రావమ్మా

కలశ ధనుర్భాణ పద్మములతో 
సిరి ముద్రలు ను కలిగి వర్షించే 
బంగారు నాణాలతో దర్శనమిచ్చే
    ధనవరలక్ష్మి రావమ్మా

సర్వ సౌభాగ్యములు శుభములిచ్చు వరలక్ష్మీ వ్రతం
సకల కార్యమందు విజయమిచ్చు వరలక్ష్మీ వ్రతం

పేరు; జక్కా నాగమణి
ఊరు: సాలూరు

0/Post a Comment/Comments