శీర్షిక:నేనేమి చేయగలను
రోజులు మారుతున్నాయి మనుషుల్లో మానవత్వం లోపిస్తుంది
హాస్పిటల్ కి వెళితే కాసులు కు దాసులై ఇల్లు వొళ్ళు గుల్ల చేస్తున్నారు
చదువుకోవడానికి వెళితే ఫీజు లు పేర్లతో దోపిడి చేస్తున్నారు
అయినా నేనేమి చేయగలను
అవసరాలకు ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే కాళ్లు అరిగినా పనులు జరగకున్నాయి
అధికారులు దయ లేకుండా దక్షిణ కోసం నిర్దయతో ప్రవర్తిస్తున్నారు
తడి తడపనదే పని ముందుకెళ్ళకుంటుంది
అయినా నేనేమి చేయగలను
ధరలు పెరుగుతున్నాయి
వస్తువులు కు రెక్కలు వస్తున్నాయి
మధ్యతరగతి వాళ్ళు గుండెలు బద్ధలవుతున్నాయి
అయిన నేనేమి చేయగలను
అడిగిన వాడు సామ్య వాది
అడగని వాడు సౌమ్య వాది
ఎదిరిస్తే తీవ్రవాది
అయినా నేనేమి చేయగలను
గొంతు విప్పి గట్టిగా అడగాలని ఉంది
నడుం బిగించి ముందుకు వెళ్లాలని ఉంది
అరాచకాలను అడ్డుకోవాలని ఉంది
అయినా నేనేమి చేయగలను
చేయాలి ఏదో ఒకటి చేయాలి
ఎవరో ఒకరు రావాలి
మంచి మార్పును తేవాలి
నేను సామాన్యుడను నేనేమి చేయగలను
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
టీచర్ సాలూరు
విజయనగరం జిల్లా
ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను