నిశబ్ద యుద్ధం
మానవత్వం మరచి మనిషి మృగమైన వేళ
మృత్యు ఘంటికలు ఆకాశాన్నoటుతున్నాయి
మనిషి పచ్చి మాంసం పీక్కుతినే జంతువైన వేళ
జంతు శాపానికి గురై దిక్కులేని చావు ఛస్తున్నాడు
ఓ మనిషి ! ఎందుకు నీకింత అహంకారం?
ఏం సాధించావని ?ఏం శోధించావని ?
వేలకోట్లు విచ్చలవిడిగా వెనకేసిన ఏం ప్రయోజనం?
కంటికి కనిపించని సూక్ష్మజీవి ఛాలెంజ్ లో నువ్వు పావువే కాదా?
సంపాదించి ప్రయోజనం ఏమిటి?
అంతా శూన్యం. అంతా మిథ్య?
నీ అతి తెలివి నీ వినాశనానికి మూలం
నీ విపరీత బుద్దులే నీ పతనానికి కారణం
ఓ మనిషీ!ఇకనైనా మేలుకో
కరోనా అనే మహమ్మారి కోరలు సాచి కాటేయాలని చూస్తోంది
మానవత్వం మరచి మృగమైన మనిషికి
బుద్ధి చెప్పటానికే తాను పుట్టానని
ఓ మనిషీ! నీ మేధకు పదును పెట్టి
మానవత్వంతో ఆలోచించి జీవించు
ఎంత సంపాదించినా ఏం లాభం?
చివరికి పిడికెడు బూడిదగ మారడం తప్ప
భగవత్ సృష్టి అద్భుతమే అనుకోకు
అతి భయానకం అని కూడా తెలుసుకో
అన్నీ తెలుసని వెర్రిగ విర్రవీగకు
ఇంటిలోనే ఉంటూ " కరోనాపై "నిశ్శబ్ద యుద్దం చెయ్యి
దేశాన్ని కాపాడటంలో చేయూతనియ్యి.
చావైనా బ్రతుకైనా నీ చేతుల్లోనే, నీ చేతల్లోనే.
వీ.వీ. ప్రసాదరావు( చైతన్య )
ఇంగ్లిష్ లెక్చరర్
కాకతీయ డిగ్రీ కాలేజి
సత్తుపల్లి
ఖమ్మం జిల్లా
తెలంగాణ రాష్ట్రం
మొబైల్ 9701099310