"నయవంచకులు" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"నయవంచకులు" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

నయవంచకులు

సమసమాజంలో పుర్రెకోబుద్ధి అన్నట్టు
మంచినికోరే వాళ్ళు చెడ్డ తలంపుతో
జీవించే వాళ్ళు వుంటారు
నయంగా నమ్మించి
వంచన చేసే దగాకోరులు
నమ్మితే నట్టేట ముంచే
నయవంచకులు
ఎరనేసి ఏనుగునులాగే
ఆగంతకులు
తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వాళ్ళు
తడికత్తులతో గొంతులు కోసీవాళ్ళు
అరచేతిలో స్వర్గం చూపించేవాళ్ళు
మనిషిని తోటిమనిషి నమ్మించి
మోసం చేయడం పరిపాటి
తమపని చేసుకోవడానికి
నయంగా భయంగా నటించి
పని అయ్యాక నిజస్వరూపం చూపే వాళ్ళని
ఏరుదాటాక తెప్ప తగలేసే రకం అనడం
ప్రేమపేరుతో నయవంచన చేయడం
అమాయకులను న్యాయంపేరిట
మోసం చేయడం నాదునేడు
నిలువుటద్దంగా మారింది
నయవంచకులను పసిగట్టి
జాగరూకతతో నడుచుకోవాలి


ఆచార్య ఎం.రామనాథం నాయుడు , మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments