తెల్లదొరల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం - అల్లూరి మహేష్ కురుమ

తెల్లదొరల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం - అల్లూరి మహేష్ కురుమ

తెల్లదొరల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి సీతారామరాజు 

దేశ స్వాతంత్య్రం కోసం తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి తెల్లదొరల చేతిలోని తుపాకిగుండ్లకు బలీ అయి చనిపోతూ 
వందేమాతరం ..
వందేమాతరం ..
అంటూ నేలకొరిగిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు గారు 1897 జూలై 4 న విశాఖపట్నం జిల్లా పాండ్రంగి లో వెంకటరామారాజు - సూర్యనారాయణమ్మ గార్లకు జన్మించాడు. కానీ పెరిగింది మాత్రం పశ్చిమగోదావరి జిల్లాలోని మోగల్లు లో... అల్లూరి సీతారామరాజు 9వ తరగతి వరకు చదివి సంస్కృతం, జ్యోతిష్యశాస్త్రం, జాతకశాస్త్రం, విలువిద్య, గుర్రపుస్వారీలో ప్రావీణ్యం పొందాడు.

1917 లో విశాఖపట్నం జిల్లా కృష్ణదేవిపేట ద్వార మన్యంలోకి ప్రవేశించి మన్యంప్రజల దీన స్థితిగతులను పరిశీలించి బ్రిటీషుఅధికారుల నిరంకుశపాలనకు వ్యతిరేకంగా విప్లవానికి సిద్దం కావాలని మన్యం ప్రజలకు తెలియజేశాడు.
 
సీతారామరాజు గారి ప్రధాన అనుచరుడు సేనానిగాం... సీతారామరాజు గారు 1922 ఆగష్టు 22 న చింతపల్లి పోలీస్ స్టేషన్ పై తొలి దాడి చేశారు. 23 న కృష్ణదేవి పోలీస్ స్టేషన్, 24 న తూర్పుగోదావరి జిల్లాలోని రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ లపై దాడిచేసి భారీమొత్తంలో ఆయుధాలు సేకరించుకుని విప్లవం మొదలుపెట్టాడు. ఎలాగైనా సీతారామరాజు గారి విప్లవాన్ని అణచివేయాలని బ్రిటీషు ప్రభుత్వం మన్యం ప్రజలను చిత్రహింసలకు గురిచేశేవారు చిత్రహింసలను చూడలేక సీతారామరాజు గారు తానే స్వయంగా బ్రిటీషు ప్రభుత్వానికి 1924 మే 7 న లొంగిపోయాడు. సీతారమరాజు గారిపై పగతో రగిలిపోతున్న బ్రిటీషు ప్రభుత్వాదికారులు చింతచెట్టుకు కట్టివేసి కాల్చి చంపారు.

సీతారామరాజు గారు కలలు కన్న స్వాతంత్ర్యము ఆయన చనిపోయిన 28 వసంతాలకు 1947 ఆగష్టు 15 న భారతదేశానికి లభించింది

మహేష్ కురుమ
ఉస్మానియా తెలుగు రచయితల సంఘం సభ్యులు
వికారాబాద్
9642665934

0/Post a Comment/Comments