భారతమాతా నమో నమః ---డా విడి రాజగోపాల్

భారతమాతా నమో నమః ---డా విడి రాజగోపాల్

భారతమాతా నమో నమః

రాజులేలిన రాజ్యం మనది
రణరంగాల రాజ్యం మనది
కత్తులు దూసుకున్న రాజ్యం మనది
నెత్తురొడ్డిన రాజ్యం మనది
పరాయి పాలనలో మగ్గిన రాజ్యం మనది
విసిగి వేసారి తిరగబడ్డ రాజ్యం మనది
స్వతంత్రం పోరు చేబట్టిన రాజ్యం మనది
అహింసా మార్గం వీడని రాజ్యం మనది
మహాత్మాగాంధీ పుట్టిన రాజ్యం మనది
సుభాశ్ భోస్  గర్జించిన రాజ్యం మనది
పోరులో  ఉరి కంబాలను లెక్కచేయని రాజ్యం మనది
వందలమంది ఒకేసారి బుల్లెట్లకు బలైన రాజ్యం మనది
అల్లూరిలాంటి వీరులున్న రాజ్యం మనది
కొమరం భీమ్ లాంటి ధీరులున్న రాజ్యం మనది
ఉయ్యాలవాడ పుట్టిన రాజ్యం మనది
ఇంకా ఎందరో త్యాగధనుల రాజ్యం మనది
స్వతంత్ర పోరులో  ఎందరో అసువులుబాసిన రాజ్యం మనది
చివరకు స్వాతంత్ర్యం సాధించిన రాజ్యం మనది 

అయితే ఏళ్ళు గడిచాయి
ఏకంగా ఏడుపదులు మరో ఐదు వత్సరాలు
సమస్యల తోరణాలు ఎన్నో ఉన్నాయి
సంపదంతా కొందరి సొత్తౌతుంది
రాజకీయాలు నిత్యం రణరంగాలతో
దూషణ భూషణాలతో  సాగుతున్నాయి
విద్య వైద్యం దోపిడి దార్ల చెరలో  ఉంది
సారా రాజ్యం మనల్ని ఏలుతుంది
ఇదేనా మనం ఆశించిన భారతం

కాదు కాదు సుమా!
వెతలు లేని భారతావని కావాలి
పటిష్ఠ పరిపాలన కావాలి
రైతే రాజు అన్న నానుడి నిజం కావాలి
అసమానతల భారతావని పోవాలి
మాటి మాటికి మధ్యంతరఎన్నికలు పోవాలి
బూజు పట్టిన చట్టాలు పోవాలి
పాలనలో రాజకీయ జోక్యాలు  పోవాలి
న్యాయవ్యవస్థ నత్త నడక మానాలి
అవినీతి రూపుమాపాలి

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుమా!
అరాచకాలపై పోరాడుమా!
ఆ బాటలో ఎప్పుడూ ముందుండుమా!
మన స్వాతంత్ర సమర వీరుల బాటన నడువుమా!
ఒక్కమారు ఆ మహనీయుల స్మరించుమా!

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

డా విడి రాజగోపాల్
9505690690


 

0/Post a Comment/Comments