సామాజిక న్యాయము --శ్రీదేవి అన్నదాసు రాజమండ్రి

సామాజిక న్యాయము --శ్రీదేవి అన్నదాసు రాజమండ్రి


సామాజిక న్యాయము శ్రీదేవి అన్నదాసు రాజమండ్రి


సామాజిక న్యాయము ఎక్కడుంది అంతా అబద్ధము

దాని పేరుపెట్టుకుని  జరిగేది మాత్రం అంతా అన్యాయము 

సామాజిక న్యాయము నీటిమీద గీతలు, 

నేతి బీరలో నేతి చందములు

కులాలు వలదంటూ మనమంతా ఒకటంటూ రాస్తున్నారు రాతలు

రెడ్డులు, రాజులు కాపులు,  కమ్మలంటూ  విభజిస్తున్నారు కులాలు

అభివృద్ధి అందరికీ అవసరమంటూ చెప్పే పనికిరాని ఉపన్యాసాలు

షెడ్యూల్డ్ కులాలు,  షెడ్యూల్డ్  తెగలంటూ ఎందుకొచ్చిన తారతమ్యాలు

మనుషులంతా ఒకటంటూ, అందరి రక్తం ఎరుపేనంటూ ప్రగల్భాలు పలుకుతూ

ఒ.సి, బి.సి , ఎస్.సి , ఎస్.టి లంటూ మనుషులకు ఈ కేటగిరీల అంటింపెందుకు

ప్రతి మనిషీ  ప్రగతి సాధించాలంటూ  కోతలు కోస్తూ

విద్యలో, ఉద్యోగాలలో ఈ రిజర్వేషన్ల గోలెందుకు

మానవులంతా సమానమంటూ , సమతా మమతల పెంచాలంటూ

పేద  గొప్ప,  ధనిక,  బీదలనే తేడాలెందుకు

పెద్దలు గద్దెలెక్కి  అధికార పెత్తనం చెలాయించడమెందుకు 

ఆ అధికారం క్రింద సామాన్య మానవుల బానిస బ్రతుకులెందుకు

సమాజమంతా ఒక కుటుంబమంటూ పుస్తకాలలో సూక్తులు రాస్తూ

అంటరానివారని కొందరిని మాత్రం దూరం పెట్టడమెందుకు 

అన్నింటా ఆడ , మగ ,సమానమంటూ శాసనసభలలో కోతలెందుకు

ఆడవారికి ఇరవై శాతం ముప్పై శాతమంటూ అన్నింటా రిజర్వేషన్ల హద్దులెందుకు

మగువలు మహరాణులంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ

ఆడదాన్ని ఒంటింటి కుందేలుని చేసి ఆడించడమెందుకు

వ్యక్తి స్వేచ్ఛలు,  పౌర హక్కులంటూ రాజ్యాంగంలో రాతలు రాస్తూ

అడగడానికి నోరువిప్పిన  అమాయకుల ఒంటిపై లాఠీల కాఠిన్యమెందుకు

సమ న్యాయం సమ పాలన , సమాన ధర్మమంటూ

కొందరికి అన్యాయం,  కొందరికే న్యాయం చేయడమెందుకు

నిరు పేదలకే ఇళ్ళంటూ  వాగ్దానాలు చేస్తూ

ఇళ్ళున్నవారికే పట్టాలు ముట్ట జెప్పుటెందుకు

పేదోళ్ళ పెన్నిదంటూ  జేజేలు కొట్టించుకుంటూ 

ముఖ స్తుతి చేసేవారికే మూట ముట్ట జెప్పుడెందుకు 

అందరూ చదవాలి, అందరూ ఎదగాలంటూ ప్రకరణలు చేపడుతూ 

రోడ్ల  పైన అనాధలు,  బాల కార్మికులంటూ బడి బయట బాలలుండుటెందుకు

స్త్రీలంటే దేవతలంటూ ,ఆరాధనకు యోగ్యులంటూ మహిళా కార్యకలాపాలనెన్నో చేస్తుంటే

నీచమైన  బ్రతుకు   బ్రతుకుతూ,హీనమైన చావు చస్తూ  దిక్కూ మొక్కూ లేని వేశ్యలుందురెందుకు

సామాజిక న్యాయము  ఎక్కడుంది  అంతా అబద్ధము 

దాని పేరు పెట్టుకుని జరిగేదంతా మాత్రం అన్యాయము .శ్రీదేవి  అన్నదాసు
కలం   శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ 

రాజమండ్రి చరవాణి   9397080613

0/Post a Comment/Comments