"తృప్తికరమైన జీవితం" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

"తృప్తికరమైన జీవితం" --- ఆచార్య ఎం.రామనాథం నాయుడు

తృప్తికరమైన జీవితం

ఆకలి రుచి ఎరుగదు
నిద్ర చోటెరుగదు అన్నట్టు
తృప్తిగా భుజించడం
తృప్తిగా నిద్రపోవడం
దేవుడిచ్చిన వరం
మనిషికి నిద్రాహారాలు ముఖ్యం

తృప్తిలేని మనిషి జీవితం
దారం తెగిన గాలిపటంలాంటిది
దేవుడిచ్చినదానితో జీవించడం తృప్తి
లేనిదానికోసం పరితపించడం అసంతృప్తి

జీవితంలో మంచి చెడులు ఎంత సహజమో
తృప్తి అసంతృప్తి అంతే సహజం
తృప్తి మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది
అసంతృప్తి జీవితాన్ని నాశనం చేస్తుంది
మనిషి సమ సమాజం కోసం జీవించాలి
లోకకల్యాణం కోసం పరితపించాలి
మానవత్వంతో మెలగాలి
దొరికినదాంతో తృప్తి పడి
ఆనందమయ జీవితాన్ని సాగించాలి
ఆదర్శప్రాయంగా నిలవాలి


ఆచార్య ఎం.రామనాథం నాయుడు , మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments