"అందం అందం అందం" -గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

"అందం అందం అందం" -గద్వాల సోమన్న , ఎమ్మిగనూరు.

"అందం అందం అందం"
------------------------

అందం అందం అందం
బాలల నవ్వులు అందం
విరిసిన పువ్వులు అందం
మిలమిల తారలు అందం

అందం అందం అందం
అవనికి మొక్కలు అందం
చెట్టుకు ఆకులు అందం
నెమలికి ఫించము అందం

అందం అందం అందం
కొలనుకు కలువలు అందం
మనిషికి విలువలు అందం
మేనుకు వలువలు అందం

అందం అందం అందం
బడిలో బాలలు అందం
మడిలో మొలకలు అందం
మదిలో మమతలు అందం

అందం అందం అందం
చక్కని నడవడి అందం
చిక్కని స్నేహము అందం
మేలిమి మాటలు అందం

అందం అందం అందం
అమ్మానాన్నలు అందం
ఇంటికి పిల్లలు అందం
మింటికి జాబిలి అందం

-గద్వాల సోమన్న ,
      ఎమ్మిగనూరు.

0/Post a Comment/Comments