పూలతోట.!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పూలతోట.!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

పూలతోట.!(కవిత)

ఒక "పూలతోట"అందంగా ముస్తాబయింది..!
రకరకాల పూల చెట్లతో..!
రంగు రంగుల 
వర్ణమ్ములతో పూలు సిగ్గుతో ముడుచుకుంటున్నాయి..!
కొత్త పెళ్లి కూతురల్లె 
పూలతోట..సింగారాలు, వయ్యారాలు..!

రంగు రంగుల 
సీతకోక చిలుకల రెక్కలు హాయిగా విచ్చుకుంటున్నాయి..!
పూల సుగంధాలు.. 
తోట నలువైపుల 
గుబాళింపులు..!
తేనె టీగల పిచ్చి 
విహరింపులు..!
ప్రతి ప్రాణి తోట లోన,
పొందు ఆనంద 
పారవశ్యాలు..!

చిలుకమ్మ అందమైన పిలుపులు..
పూలతోటను,
మనోహరంగా మార్చిన వేళ..తోటలో 
ప్రతిధ్వనించిన 
ఆనంద రాగ లాహిరులు..!
అందమైన పూలతోటలో,అందమైన చిట్టి పిట్టలూ.. వాటి 
కిచ కిచమను కూతలు..!
ఝుమ్మంటు తుమ్మెదల కూని రాగాలు..!
"పూలతోట"
పులకించి పోయింది..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,
నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments