మణిపూసలు
***********
జనులంతా జతకట్టి
అవినీతిని అరికట్టి
అభివృద్ధి పథములో
నడవాలి నడుంకట్టి
అభాగ్యుల నాదరించి
అభయహస్తమందించి
చిరు దీపం వెలిగించు
అశ్రయాన్ని కల్పించి
కులమతాలు కూలద్రోసి
కదలిరండి కలసిమెలసి
మానవత్వ పరిమళాల
సమైక్యతను కలబోసి
✍🏻వల్లంభట్ల వనజ
అదిలాబాద్
Post a Comment