మహోన్నతమైన సంస్కృతికి .....
పుట్టినిల్లు పుణ్య భరతజాతి!
ప్రపంచ దేశాలకు వ్యాపించే.....
ఖండాంతరన మన ఖ్యాతి!
విశ్వంలో ప్రత్యేక గుర్తింపు ....
నొందే మన జాతి సంస్కృతి!
అందరిలో మహోజ్వల మై....
వెలిగే మనదైన ఉన్నతి!
భావితరాలకు తెలుపుదాం...
ఘనమైన సాంప్రదాయమును!
వారికి నేర్పుదాం మనవైన ....
మంచి మానవత విలువలను!
మన సంస్కృతిని అలవర్చుకొని...
ఆనందంగా అలరాడుదాం!
వాటినిఅందరికి చాటి చెప్పి...
వాటి ఉనికిని కాపాడుదాం!
పలు విదేశీయులను సైతం...
ఆకట్టుకున్న మన సంస్కృతి!
ముచ్చటైన కట్టు బొట్టుతో...
నిండుదనం తో దాల్చే ఆకృతి!
కొత్త ప్రియాంక (భానుప్రియ)
గ్రా:వల్లభరావుపల్లి
మం.మీడ్జీల్
మహబూబ్నగర్
9553352929