"ప్రత్యక్ష దైవాలు - వైద్యులు" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

"ప్రత్యక్ష దైవాలు - వైద్యులు" --- ఆచార్య ఎం రామనాథం నాయుడు

ప్రత్యక్ష దైవాలు - వైద్యులు


నిత్యజీవితంలో మనిషికి వైద్యం అవసరం
ఆరోగ్యపరిరక్షణకు వైద్యుడు అత్యవసరం
ఆరోగ్యం భౌతికశరీరానికే కాదు
ఆధ్యాత్మిక శరీరానికి అవసరం
వేదవేద్యులు వెతికేది ఆదిఅంతంలేనిది
సర్వరోగసంజీవిని తెల్లకోటు


వృత్తులలోకెల్లా ఘనమైనవృత్తి వైద్యవృత్తి
విద్యలలోకెల్లా మేటివిద్య వైద్యవిద్య
మనిషిప్రాణం యమునిబారినుండి
ఆపద్భాందవుడిలా కాపాడే ప్రత్యక్షదైవం
మనిషి అంగాంగాలను రక్షించే
రక్షణకవచాలు వైద్యులు

వైద్యోనారాయణోహరి అన్నట్టు
రాముడు మేఘనాధుడిని సంహరించినట్టు
కలియుగంలో కరోనరక్కసి
కోరలు పీకడానికి వైద్యనాధుడై
జైవికపోరుకు సిద్దమై
వైద్యులరూపంలో ప్రాణాలు పణమోడ్డి
బుసలుకొడుతున్న కరోనరక్కసిపై
పోరు సల్పే వీరసైనికులకు వందనం
తెల్లకోటుధరించిన వైద్యులకు
అభివందనం


ఆచార్య ఎం రామనాథం నాయుడు
మైసూరు
+91 8762357996

0/Post a Comment/Comments