గతంలేని జీవితం. పేరు: సి. శేఖర్(సియస్సార్)

గతంలేని జీవితం. పేరు: సి. శేఖర్(సియస్సార్)

శీర్షిక: గతంలేని జీవితం

విధి ఆడిన వింతనాటకంలో
వీదులపాలైన పసిబాలలు
ఆలనాపాలనా లేని అనాథలై
ఆకలితో విలవిలలాడుతూ
అమ్మనాన్నలు కానరాక కష్టాలతో కరిగిపోతున్న
ఎటూతోచని లేమితనంతో  
పక్కటేముకలు ఎండి డొక్కల్లోతుల్లో 
నకనకల కేకలు కడుపులో రగిలే మంటల్లో
మాడి మసైపోతోన్న బాల్యం

ఏ ముండ్లకంపలో జన్మనెత్తిరో
ఏ చెత్తకుండి చేరదీసెనో
జనారణ్యంలో జాలిలేని మనుషులమధ్యలో పెరిగి పెద్దయ్యారో
చెత్తకప్పలే కదా ఆకలితీర్చే అమ్మలు
ఎన్ని పస్తులున్నరో 
వానలో చలిలో ఎండలో
కాలమేదైనా కాయనికెపుడు నిండా గాయాలే ఆ దేహాలకు

అడిగేవాడు చెప్పేవాడెవడు
అడ్డులేదు అదుపులేదు
పొద్దులేదు హద్దులేదు
వాడేంచేసినా వాడేంచూసినా
రేపటి భవిష్యత్ తెలియని
చీకటినిండిన చీదరింపుల అభాగ్యులు
అనాథబతుకుల జీవనపోరాటం
అదో తీరని మాయని వేధన
తోచని ఆక్రందనలో తీరే మారనిబతుకులు
గాలి ఎటువీస్తే అటు కొట్టుకుపోతూ
ఏ తీరంచేరలో తెలియని నావలా పయనం

ఇల్లులేక ఇడుపులేక
రోజుకోచోట ఒంటరినిద్ర
ఒడిదుడుకులే అడుగడుగునా
మనసెంత మోడుబారిందో
చూపుల్లో చులకనలు
మాటల్లో లుకలుకలు
మౌనంగా భరిస్తూ భరోసా కోసం 
గాలికి తెగిన గాలిపాటలు
అనాథ బాలల జీవితాలు

సి. శేఖర్(సియస్సార్),
పాలమూరు,
9010480557.




0/Post a Comment/Comments