జయ జయ జయహో హాలికా...! --కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

జయ జయ జయహో హాలికా...! --కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం

 

జయ జయ జయహో హాలికా...!
--కొంపెల్లి రామయ్య (యామిని తేజశ్రీ)ఖమ్మం
7032504646

పల్లవి:
జయ జయ జయహో హాలికా
జయ జయ జయహో శ్రామికా
దేశానికి నీవే వెన్నెముకా
రాజ్యానికి రాజువే నీవికా!   //జయ జయ//

చరణం :1
దుక్కిలోన నాగలివై సాలు కలియతిరిగావు
విత్తనాలు నాటి నీవు విత్తై మొలకెత్తావు
నాటులోన నాటై పైరు పంట వైనావు
నూర్పులోన రాశివై అన్నదాతవైనావు !  //జయ జయ//

చరణం:2
గిట్టుబాటు ధరలివ్వని మార్కెట్ మాఫియా దాడి
అతివృష్టి అనావృష్టి ప్రకృతి విధ్వంసంలో
అన్నదాత హలదారి ఆత్మాభిమానంతో
కన్నీళ్ళను మూటగట్టి ధైర్యంతో  నడిపిద్ధాం ! //జయ జయ//

చరణం:3
ఎద్దు ఏడ్చిన యవసం ! రైతు ఏడ్చిన రాజ్యం!
బాగుపడిన చరిత్ర ప్రపంచంలో లేదోయ్!
జైకిసాన్ అనకున్నా!జేజేలు పలకకున్నా!
మూడు పూటలు! నాలుగు ముద్దలు తినేలా చేద్దాం! // జయ జయ//

చరణం:4
పిడికెడు బువ్వ కోసం పిప్పి ఐన రైతన్నా
కాయకష్టం కలిసి కాలంతో రాకున్నా
గుండె ధైర్యమే నీకు బతుకు బాటరోయన్నా 
దేశాభివృద్ధికై పిడికిలెత్తి సాగుదాం...! //జయ జయ/


0/Post a Comment/Comments