మానవ సేవయే మాధవ సేవ..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మానవ సేవయే మాధవ సేవ..!(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

మానవ సేవయే మాధవ సేవ..!(కవిత)
*****✍🏻విన్నర్****

సాయం చేసే మనస్సుని పొగడక తప్పదు..!
సాయం చేయడంలో దైవత్వం నిండి ఉంటుంది..!
దేవుడు సైతం ప్రశంస కురిపిస్తాడు..!
సాయం చేసే మనుష్యులు ఇలపై వెలసిన పుణ్య పురుషులు..!
చాలా మంది సాయం చేయడంలో ఆలోచిస్తారు..!
కాని,అనేకులు ఉన్నారు సహాయం చేసే గొప్పవారు..!
ఒక్కటే తేడా..సాయం చేసే వాళ్ళను అందరూ అభిమానిస్తారు..ఇష్టపడతారు,మర్యాద ఇస్తారు..!
వెనకాడే వారిని, దూరంగా ఉంచుతారు..!
చేసే సాయం చిన్నదైనా,పెద్దదైనా..అది కాదు విషయం..!
సాయం చేసే మనసుది గొప్పతనం..!
ఈ సమాజంలో సాయం చేసే వారికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది..!
మానవ సేవయే మాధవ సేవ అని ఊరకే అనలేదు..!
ఎంతో మంది అభాగ్యులు,అనాధలు, పేదలు,నిరుపేదలు,అన్నార్తు లూ,అంగవైకల్యం ఉన్నవారు..
వీరందరికీ సాయం చేయడం మన తక్షణ కర్తవ్యం..!??

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్,నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

1/Post a Comment/Comments

Post a Comment